Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:09 pm Posted by : ramakrishna

మహారాణా ప్రతాప్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా…

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చరిత్రలో అత్యంత ధైర్యవంతుడైన రాజుల్లో మహారాణా ప్రతాప్ ఒకరన్నారు. స్వామిమాణం దేశభక్తి ధైర్య సాహసాలకు ఆయన ప్రత్యేకగా నిలిచారని కొనియాడారు. మొగల్ చక్రవర్తి అక్బర్ ఆధిపత్యానికి ఎదురుగా నిలిచి స్వాతంత్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ప్రధానంగా హల్దీ గాటి యుద్ధం ఆయన వీరత్వానికి గుర్తుగా నిలిచిందన్నారు. ఆయన రాజ్యం కోల్పోయిన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదన్నారు. శత్రువులకు తలవంచకుండా అడవుల్లో కష్టాలు పడుతూ జీవించాలని గుర్తు చేశారు. నేటి యువత మహారాణా ప్రతాప్ సింగ్ జీవిత నాదశంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొందిల రజక సంఘం అధ్యక్షుడు బొందిల బలరాం సింగ్, కార్యదర్శి నరేష్ సింగ్ కోశాధికారి మహేందర్ సింగ్, ఉపాధ్యక్షుడు తులసిరాం, విజయ్ సింగ్, రమేష్ సింగ్, లఖన్ సింగ్, బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, నాయకులు పవన్ ముందడ, గోసేవ ప్రతినిధి  ధాత్రిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Efforts will be made to erect a statue of Maharana Pratap...