సాగునీరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తా

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   సదాశివనగర్, బతుకమ్మ : సాగునీరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ ను గురువారం ఆయన పరిశీలించిన ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేసానని తెలిపారు....