- టీఎస్సీసీ స్టేట్ సెక్రటరీ మాణిక్యాల ఏలియా
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాలల్లో తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ కౌన్సిల్ (టీ ఎస్ సీ సీ)కమిటీలను ఏర్పాటు చేసి కౌన్సిల్ బలోపేతానికి కృషి చేస్తానని టీ ఎస్ సీ సీ స్టేట్ సెక్రటరీ మాణిక్యాల ఏలియా అన్నారు. శనివారం మాణిక్యాల ఏలియాను తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటీల నియామక ఇంచార్జ్ గా మాణిక్యాల ఏలీయాను నియమిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సి సి టి రాష్ట్ర జనరల్ కార్యదర్శి మోహన్ బాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. అన్ని జిల్లాల్లో సమర్థవంత కమిటీలా ఏర్పాటుకు రాష్ట్రమంతట పర్యటిస్తానని ఏలీయా వెల్లడించారు.నిజామాబాద్ నగరంలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జెకర్యా ఆనంద్ , కార్యదర్శి దానియేలు, జాన్ బన్యాన్, క్రైస్తవ నాయకులు ఎజి జోసెఫ్ , జాన రమేష్ లతోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు మాణిక్యాల ఏలియాతో పాటు గజ్వేల్ కు చెందిన రూబెన్ ను నియమించినట్లు వెల్లడించారు.