Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 6:55 pm Posted by : ramakrishna

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

 

. . . టీఎన్ జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

 

. . . 2026-29 టీఎన్ జీఓ ఎన్నికలు ఏకగ్రీవం

 

బోధన్, బతుకమ్మ :

 

యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగులతో మమేకమై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. 2026-2029 కాలవ్యవధికి గాను, టీఎన్జీవో ఎన్నికల్లో భాగంగా టీఎన్జీవో బోధన్ యూనిట్ ఎన్నికలను నిర్వహించారు. టీఎన్జీవో నియమావళికి అనుగుణంగా నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శుల పదవులతో సహా అన్ని పదవులకు సింగిల్ సెట్ నామినేషన్ వచ్చినందున, ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టుగా ఎన్నికల అధికారి ఫలితాలను వెల్లడించారు. వ్యవసాయ శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ని ఎన్నికల అధికారిగా, జాఫర్ హుస్సేన్ ఎస్ఎ ని సహాయక ఎన్నికల అధికారిగా నియమించారు. బోధన్ పట్టణం లో గల లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన సదరు యూనిట్ సర్వసభ్య సమావేశానికి, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై ఏకగ్రీవంగా ఎన్నికైన బోధన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు పూలమాలవేసి అభినందించి, ఎన్నికల ఫలితాల ఉత్తర్వులను అందజేశారు. బోధన్ యూనిట్ అధ్యక్షులుగా కార్తీక్ (ట్రెజరీ శాఖ), యూనిట్ కార్యదర్శిగా సాయిలు (వ్యవసాయ శాఖ) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, టీఎన్జీవో నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి ఆర్మూర్ యూనిట్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, విశాల్ టీఎన్జీవో భీమ్గల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సృజన్ కుమార్, సాయికుమార్, రూరల్ యూనిట్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మ,గంగరాజు, మహేందర్, శ్రీనివాస్, స్వామి, భూమయ్య, బోధన్ యూనిట్ ఉద్యోగులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Efforts should be made to resolve employee problems.