- బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ
బతుకమ్మ:బిచ్కుంద : ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, గుండుంబా, మత్తు పదార్థాల నిర్ములనపై మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ సద్గురు బండ అయ్యప్ప పాఠశాల, మైనార్టీ పాఠశాలలోఅవగాహన సదస్సు నిర్వహించారు. వాటి వలన కలుగు దుష్పపరిణాలను తెలియచేశారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తుకై మంచి చదువులు చదివి తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆబ్కారీ సిఐ సత్యనారాయణ అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఎంతోమంది జీవితాలు మధ్యంతరంగా గిసిపోతున్నాయన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన పై మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్దఎత్తున విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై నాగేష్, కానిస్టేబుల్ శ్రీధర్, బాలమణి, దేవి సింగ్, జిల్లా విద్యాధికారి షేక్ సలాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి, మైనార్టీ పాఠశాల సిబ్బంది,శ్రీ సద్గురు బండ అయ్యప్ప పాఠశాల యాజమాన్యం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.