Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 8:36 pm Posted by : ramakrishna

పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు బాగా పెరిగేలా కృషి చేయాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

పల్లె లో ప్రభుత్వాలు నాటిన మొక్కలు బాగా పెరిగేలా ప్రతిరోజు నీరు పోసి పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాలు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు.

 

Efforts should be made to ensure that plants grow well in rural natural forests.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి పనులను నాణ్యతతో పూర్తి చేసుకుని ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పొందాలన్నారు. పల్లె ప్రగతి వనాల్లో మొక్కలకు ప్రతిరోజు నీరు అందించాలని పిచ్చి మొక్కలు తొలగిస్తూ ప్రకృతి వనాలలో శుభ్రతను పాటిస్తూ క్రమం తప్పకుండా నిర్వాహణ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల,  డిఎల్పిఓ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో రాజ్ కిరణ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఆయా శాఖల అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

 

 

Efforts should be made to ensure that plants grow well in rural natural forests.