Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 9:55 pm Posted by : ramakrishna

నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సాక్షులను కోర్టు లో హాజరు పరిచి  నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కమాండ్ కంట్రోల్ హాల్ లో ఆదివారం కోర్ డ్యూటీ కానిస్టేబుల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కోర్ట్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన భాగంగా పనిచేస్తున్నారన్నారు. కోర్ట్ డ్యూటీ అనేది కేవలం ఒక విధిగా కాకుండా, ప్రజలకు న్యాయం అందించడంలో మీ పాత్ర ఎంత ముఖ్యమైనదో గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు నిర్వహించే ప్రతి చర్య , కోర్ట్‌కు సమయానికి హాజరు కావడం, సాక్షులను సురక్షితంగా తీసుకురావడం, న్యాయ ప్రక్రియలు నిరవధికంగా సాగిపోవడంలో సహకరించడం ,  ఇవన్నీ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. మీ పని తీరు , ప్రవర్తన , సమయపాలన , నైతిక విలువలు మొదలగునవి ఇవన్నీ పోలీస్  విభాగం యొక్క క్రమశిక్షణను ప్రతిబింబిస్తాయని, మీ సేవలను నిజాయితీగా , నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. భవిష్యత్తులో ఇంకా సమర్థంగా పనిచేయాలని, పోలీస్ శాఖ గౌరవాన్ని మరింతగా పెంచే విధంగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి ,  సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్ , కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Efforts should be made to ensure that criminals are punished