నేరాల నియంత్రణకు కృషి చేయాలి
నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సింధూశర్మ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ కొత్త సంవత్సరంలో సిబ్బంది అందరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, అందుకోసం ఒక ప్రణాళికను రూపొందిచుకోవాలని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సింధూశర్మ సూచించారు. నగరంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎసిపి, సీఐ, ఎస్ హెచ్ఓ, ఎస్ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నేరాల నియంత్రణ కోసం ప్రతీ సిబ్బంది తమ పై అధికారుల సూచనలను తూచ తప్ప కుండా పాటించాలని...