నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సింధూశర్మ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ కొత్త సంవత్సరంలో సిబ్బంది అందరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, అందుకోసం ఒక ప్రణాళికను రూపొందిచుకోవాలని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సింధూశర్మ సూచించారు. నగరంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎసిపి, సీఐ, ఎస్ హెచ్ఓ, ఎస్ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నేరాల నియంత్రణ కోసం ప్రతీ సిబ్బంది తమ పై అధికారుల సూచనలను తూచ తప్ప కుండా పాటించాలని అన్నారు. ప్రధానంగా చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రధానదృష్టి సారించాలని అన్నారు. కోర్టు కేసుల విషయంలో త్వరితగతిన స్పందించాలని, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పర్చాలని, నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, ప్రొబేషనరి ఐపియస్ సాయికిరణ్ పత్తిపాక, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సియస్బి, సిసిఆర్బి, సిసిఎస్, సైబర్ క్రైమ్, సిటి.సి ఎసిపిలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
