Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 7:24 pm Posted by : ramakrishna

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి

మోర్తాడ్, బతుకమ్మ: పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ముస్కు రాజేందర్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4 అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. దాతలు అనూప్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు ముసుకు రాజేశ్వర్ రెడ్డి, భారతి ఇద్దరు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి మాట్లాడుతూ 15 లక్షలు వెచ్చించి నాలుగు అదనపు గదులు నిర్మించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జగదీశ్వర్,  అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మీరా, ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Efforts should be made for the all-round development of students.