పసుపు రైతును ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి జరగాలి

వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి నిజామాబాద్,  బతుకమ్మ : పసుపు పంటను సాగు చేస్తున్న రైతాంగం ఇబ్బందులను పరిష్కరించి వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కె.వి.నరసింహారెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, ఎం.భవాని తదితరులతో కూడిన బృందం గురువారం నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చేస్తున్న ఆర్మూర్ డివిజన్ లోని ఆయా ప్రాంతాలలో పర్యటించి...