ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రి దిష్టిబొమ్మలు దహనం

బతుకమ్మ, మోర్తాడ్; కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదని సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగ్ శీను, ఏఎంసి డైరెక్టర్లు మహిపాల్, శెట్పల్లి రంజిత్, అబ్దుల్ నవీద్, యూత్ కాంగ్రెస్ నాయకులు అర్గులు...