Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 4:58 pm Posted by : ramakrishna

ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రి దిష్టిబొమ్మలు దహనం

బతుకమ్మ, మోర్తాడ్; కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదని సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగ్ శీను, ఏఎంసి డైరెక్టర్లు మహిపాల్, శెట్పల్లి రంజిత్, అబ్దుల్ నవీద్, యూత్ కాంగ్రెస్ నాయకులు అర్గులు రమేష్, రవి, జిన్న అరుణ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం అనిల్, ఆనంద్, దేవేందర్, కుంట శీను, మాజీ ఎంపిటిసి అజహర్, అడవాకెట్ ప్రవీణ్, ఆoజాద్. ఖిజర్, చిన్న గంగారాం ఆటో యనియన్ ప్రెసిడెంట్ మాన్నాన్ గంగాధర్, తిమ్మాపూర్ గోపి, సుంకెట్ మహేష్, గండ్లపేట్ సాయిరాం సంజీవ్, ఒడియట్ నవీన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.