రుద్రూర్, బతుకమ్మ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ పై జగదీశ్ రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, పార్వతి ప్రవీణ్, షేక్ నిస్సార్, కర్క అశోక్, అడప సాయిలు, పత్తి రాము, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, కుర్మాజి సాయిలు, చిక్కడపల్లి రవి, సంజీవ్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
