Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:34 pm Posted by : ramakrishna

తెలంగాణలో సమర్థవంతమైన పాలన రేవంత్ రెడ్డితోనే సాధ్యం

 

. . . బీఆర్ఎస్ అప్పుల పాలు చేసి కాంగ్రెస్ ను విమర్శించడం సరైంది కాదు

 

. . . సబ్బండ వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

 

. . . మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణకు రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ వెల్లడించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. గురువారం ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ, అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి సాగుతుందన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే అభివృద్ధి కొంత ఆలస్యం ఆవుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి చేయడం లేదని కాంగ్రెస్ విమర్శించడం సరైంది  కాదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ కు దౌర్భాగ్యపు పరిస్తితి వచ్చేలా చేశారన్నారు. అప్పులకుప్పగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయడం లేదని మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఈ రాష్ట్రం ఇలా ఉండడానికి కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ  చొరవ వల్లనే తెలంగాణ వచ్చిందనీ, ఇచ్చిన మాట ప్రకారం బిల్లు పెట్టించి ఆమోదించేలా చేశారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ, దేశానికి రాష్టానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రాన్ని జిల్లాను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, రేవంత్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఆయనను మించిన నాయకుడు లేడన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం సెలవు తీసుకోకుండా అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. నిజామాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తుందని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానీదే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. కష్టపడి పని చేసిన వారికి పదవులు వస్తాయని, ఎలాంటి పదవులు లేకున్నా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు.