సివిల్ పంచాయితీల ఎఫెక్ట్
డిచ్ పల్లి సర్కిల్ పోలీసులపై అట్రాసిటి కేసు నమోదు చేయాలి మోపాల్ ఎస్సైకి కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు వివాదాల్లో నిజామాబాద్ సబ్ డివిజన్ లో పోలీసులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ సబ్ డివిజన్ పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సివిల్ పంచాయితీల్లో వేలు పెట్టి వివాదాల్లో కూరుకపోతున్నారు. సామాన్య ప్రజల వ్యక్తిగత ఆస్తులు, భూముల పంచాయితీలను సెటిల్ మెంట్ చేస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లను సివిల్ పంచాయితీలకు అడ్డాలుగా మార్చుకుని పంచాయతీలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుకుపెట్టుకుని చేస్తున్న అరాచకాలకు ప్రజలు...