Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 5:54 pm Posted by : ramakrishna

డిప్యూటీ చీఫ్ డీ మిషన్ గా ఈగ సంజీవ్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 14 వరకు ఉత్తర ఖాండ్ లో జరుగనున్న నేషనల్ గేమ్స్ కు డిప్యూటీ చీఫ్ డీ మిషన్ గా డిస్ట్రిక్ట్ ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈగ సంజీవ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేషనల్ గేమ్స్ కు తెలంగాణ నుండి ఇద్దరు డీ సీ డీ ఎం లను నియమించగా అందులో జిల్లా నుండి సంజీవ్ రెడ్డి నియామకామవ్వడం విశేషం. సంజీవ్ రెడ్డి నియామకం పట్ల ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ ఆంధ్యాల లింగన్న, జనరల్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య, జిల్లా వర్గ సభ్యులు,వివిధ క్రీడా సంఘాల భాద్యులు హర్షం వ్యక్తం చేశారు.