మళ్లీ మూసివేసిన ఏడుపాయల ఆలయం

మెదక్, బతుకమ్మ : మంజీర లో వరద పెరగడంతో మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయాన్ని శనివారం మళ్లీ మూసివేశారు. జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పొంగిపోర్లుతుంది. దీంతో శనివారం ఉదయం ఆలయం వద్ద నదిపాయల్లో వరద పెరిగింది. అర్చకులు అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించినంతరం ఆలయాన్ని మూసివేశారు. భక్తుల కోసం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగిస్తున్నారు.