అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలి
తప్పుడు ప్రచారాలతో డబ్బులు వసూలు చేస్తున్న ప్రెసిడెన్సీ విద్యాసంస్థ ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ సంఘాల నాయకులు నిజామాబాద్, బతుకమ్మ : ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వారు నగరంలోని వినాయక్ నగరంలో గల ప్రెసిడెన్సీ (మెయిన్ బ్రాంచ్ ముందు) ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏఐయూటీసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం లు మాట్లాడుతూ.. ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ (ఆరావళి క్యాంపస్) పేరుతో...