తప్పుడు ప్రచారాలతో డబ్బులు వసూలు చేస్తున్న ప్రెసిడెన్సీ విద్యాసంస్థ
ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ సంఘాల నాయకులు
నిజామాబాద్, బతుకమ్మ : ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వారు నగరంలోని వినాయక్ నగరంలో గల ప్రెసిడెన్సీ (మెయిన్ బ్రాంచ్ ముందు) ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏఐయూటీసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం లు మాట్లాడుతూ.. ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ (ఆరావళి క్యాంపస్) పేరుతో విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అడ్మిషన్ నిర్వహిస్తుందని ఆరోపించారు. అలాగే తప్పుడు ప్రచారాలతో ఓటింగ్ పెట్టి 50% ఫీజు ముందే వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారికి, అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రెసిడెంట్ విద్యా సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రెసిడెన్సీ విద్యాసంస్థల యాజమాన్యం అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరపున వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఇన్సప్ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ ఖాన్, అలీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుభొద్, కుశాల్,దినేష్, నవీన్ కృష్ణ,కార్తీక్, వంశీ, నాయకులు పాల్గొన్నారు.