నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజు ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాధించిన పురోగతి అంశాలను, ఎన్ సీసీ క్యాడేట్ల విజయాలను, డ్రిల్ ప్రదర్శనను, జిజ్ఞాస ప్రాజెక్టుల పరిశోధనల ప్రదర్శనను నిర్వహించడం జరిగిందని ఇన్ చార్జి ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.రంగరత్నం తెలిపారు. అకాడమిక్ అంశాలతో పాటు, స్పోర్ట్స్, ఉన్నత విద్యలో కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులు, ఎన్.సీసీ. క్యాడెట్లు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, సాధించిన వివిధ విజయాలను ప్రదర్శించడమైనదని అన్నారు.

విద్యార్థులు ప్రత్యేక దృష్టికోణంతో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, పి.ఆర్.ఓ. దండుస్వామి, జిజ్ఞాస కో ఆర్డినేటర్ ముత్తెన్న, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, ఏవో రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు చంద్రశేఖర్, కిరణ్ కుమార్ గౌడ్, వివేక్, పూర్ణచంద్ర రావు, కే. గంగాధర్, విద్యార్థులు, క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.
