నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మే 10 నుండి 17 వరకు జరుపుతున్న “విద్యావారోత్సవాలు” కార్యక్రమాన్ని సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. కళాశాల విద్యా కమీషనర్ ఆదేశాల ప్రకారం రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాలను ప్రిన్సిపాల్ వివరించారు. సమన్వయ కర్తలకు బాధ్యతలు అప్పగించారు. మొదటి రోజు కళాశాలలోని వివిధ విభాగాలు ఇతర సంస్థలతో విద్యా అభివృద్ధికి చేసుకున్న పరస్పర ఒప్పందాలను అధ్యాపకులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, ఏ.వో. రామ్ కిషన్, సమన్వయకర్తలు రాజేశ్, రంజిత, వినయ్ కుమార్, దండు స్వామి, బాలామణి, రామస్వామి, జయ ప్రసాద్, పూర్ణచందర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ముత్తెన్న, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
.