Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 5:48 pm Posted by : ramakrishna

సమాజాన్ని ఉన్నతీకరించడంలో విద్య దే కీలకమైన పాత్ర

 

. . .ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్టారెడ్డి

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

విద్య ను ఉన్నతీకరించే ప్రయత్నం విశ్వవిద్యాలయాలు సంస్కరణలు చేపడుతున్నాయి. ఉన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవస్థలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్టారెడ్డి అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్టారెడ్డి  సందర్శించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ …ఎన్.ఈ.పి. ఆధారంగా విద్యార్థి కేంద్రకంగా విద్యలో గుణాత్మకమైన మార్పుల కోసమే డిగ్రీ, పి.జి. పాఠ్య ప్రణాళిక మార్పులు చేపడుతున్నామని తెలిపారు. రీసెర్చ్ అవార్డ్స్, లెర్నింగ్ మెటీరియల్, సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, పీర్ రివ్యూ జర్నల్స్ తదితర అంశాలను రూపొందించి వెబ్సైట్లో పొందు పరచమని అధ్యాపకులు మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రంగా రత్నం, పిఆర్ఓ దండు స్వామి, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, అధ్యాపకులు రంజిత, వినయ్ కుమార్, ముత్తన్న, చంద్రశేఖర్, జయప్రసాద్, రామకృష్ణ, రమేష్ గౌడ్, బాలమణి, పూర్ణ చందర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Education plays a crucial role in uplifting society