Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 1:27 pm Posted by : ramakrishna

చదువుతోనే భవిష్యత్

భీమ్ గల్, బతుకమ్మ : చదువుతోనే భవిష్యత్ ఉంటుందని, విద్యార్థి దశలో ఇష్టంతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్ అన్నారు. మండలంలోని బెజ్జోరా జెడ్పీహెచ్ఎస్ లో ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన గంగా గోపాల్ (585), దీప్తి (584), కీర్తన (579) లను మంగళవారం రవీందర్ సన్మానించి భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, చదివిన పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా సన్నద్ధం చేసిన స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వేల్పూర్ మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, బెజ్జోరా గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్ల మహేందర్, సీనియర్ నాయకులు సంధ్యారాజు, మూడేడ్ల శ్రీనివాస్, లక్కోరా మల్లికార్జున్, గంగాధర్, కంఠం శేఖర్, అరవింద్, అభి, దిలీప్, సంజయ్, రోహిత్, ప్రవీణ్, జెడ్పీహెచ్ఎస్ బెజ్జోరా పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.