ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన
రుద్రూర్, బతుకమ్మ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఉంటుందని రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్ అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాశాఖ అధికారి కట్టా శ్రీనివాస్ రావు, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, గౌరవ...