Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 4:13 pm Posted by : ramakrishna

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన

రుద్రూర్, బతుకమ్మ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఉంటుందని రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్ అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాశాఖ అధికారి కట్టా శ్రీనివాస్ రావు,  రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, గౌరవ సలహాదారులు కేవి.మోహన్, వి. శరత్ బాబు, బెజగం వెంకటేశం గుప్తా, ఉపాధ్యక్షులు ఈరాపురం సాయిలు, నూత్ పల్లి బాలరాజు, కోశాధికారి చిదుర మహిపాల్ గుప్తా, సమాచార కార్యదర్శి కౌలాస్ గంగాధర్, డైరెక్టర్లు దుర్కి సాయిలు, కర్కా అశోక్, పుట్టి ప్రవీణ్, పాఠశాల హెచ్ ఎం సంధ్యా,  ఉపాధ్యాయబృందం తదితరులు పాల్గొన్నారు.