విద్య బోధన తో తలరాత మారుతుంది

జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : విద్య బోధనతో విద్యార్థిని విద్యార్థులు తమ తలరాతను మార్చుకోవచ్చు అని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయ, అధ్యాపకుని గౌరవించాలని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్ విద్య...