నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నగరంలోని 50వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎడ్ల బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం శివాజినగర్ జోన్ కార్యాలయంలో ఎడ్ల బాలకృష్ణ నామినేషన్ వేశారు. గత 30 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పార్టీకి బాలకృష్ణ సేవలందిస్తున్నా నని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ సెల్ మోర్చ అధ్యక్షులుగా పని చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం 50వ డివిజన్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తకే బీజేపీ టికెట్ ఇవ్వాలని కోరారు.
