ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ సమన్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించి గూగుల్ , మెటా లకు ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.  ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన కేసులో గూగుల్ మెటాలను ఈడీ విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు,  ఇన్ ఫ్లుయెన్సర్లపై దృష్టి సారించింది.