Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 12:18 pm Posted by : ramakrishna

పాత బస్తీలో ఈడీ సోదాలు

భూదాన్ మహేశ్వరం భూముల వ్యవహారంలో..

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని పాత బస్తీలోని యాకుత్ పురా, సంతోష్ నగర్ లో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. భూదాన్ మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈతనిఖీలు చేపట్టారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు  ఈఐపీఎల్ కంపెనీ భూములు విక్రయించింది. ఈ ఐపీఎల్ కంపెనీకి బినామీగా సుకూర్ ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈక్రమంలో సుకూర్, అతడి బంధువు షర్పన్, మరో ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిపింది.  ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్, మహేశ్వరం తహసీల్దార్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.