సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి ఈడీ ఎంట్రీ
కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంటరైంది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈకేసు వివరాలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలు ఉన్నాయి. సరోగసీ పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం చేసినట్లు ఈడీ...