. . . జిల్లా జడ్జి భారత లక్ష్మీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వ్యవస్థలలో పాలకవర్గాలు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి వి ఎన్ భారత లక్ష్మీ అన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల పరపతి సహకార సొసైటీ లిమిటెడ్ నూతన అధ్యక్షుడు చింతకుంట సాయిరెడ్డి, కార్యదర్శి పడిగల వెంకటేశ్వర్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ వెంకటరమణ గౌడ్ జిల్లాకోర్టు సముదాయంలోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన సందర్బంగా ఆమె వారితో సొసైటీ ప్రగతి పట్టిక గూర్చి వాకబు చేస్తు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి సంభాశించారు. వ్యవస్థలలో ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే ఆర్థికవృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఒకవైపు న్యాయవాద వృత్తి మరొకవైవు సొసైటీ అదనపు ఆర్థిక బాధ్యతలు సమన్వయం చేసుకుని సొసైటీని అధిక లాబాల వైపు తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. ఇల్లు అయిన, వ్యక్తిగత ఎదుగుదల అయిన, ఫైనాన్స్ వ్యవహారాలు అయిన ఆదాయం, ఖర్చులలో సమతుల్యతను పాటిస్తే ఆర్థికానికి లోటు ఉండదని ఆమె సొసైటీ బాద్యులకు ఎరుక జేశారు. సొసైటీలో నూతన పొదుపు పథకాలు తీసుకువచ్చి ఖాతాదారులకు లాభాలు దాంతోపాటు సొసైటీకి లాభాలు రావాలని ఆమె అకాక్షించారు.