Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 5:18 pm Posted by : ramakrishna

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లు దేశంలో అమలు చేయాలి

 

. . .జిల్లాకు చేరిన ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర

 

ఇందూర్, బతుకమ్మ :

 

కుల వివక్షకు స్వస్తి పలికి, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర కొనసాగుతుంది.ఆర్థిక్, ఆధార్, ఆరక్షన్ ఆందోళన్ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రథయాత్ర నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డులో గల ఓ హాల్ లో మీడియాతో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నామని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. అక్టోబర్ 2న ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి ప్రారంభమైన ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఈ యాత్రను చేపట్టారు.కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములై ఐక్యంగా, అభివృద్ధి చెందిన భారతదేశ  నిర్మాణానికి కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ రథయాత్ర కార్యక్రమంలో ఆర్థిక, ఆధార్,ఆరక్షణ ఆందోళన్ తెలంగాణ కోఆర్డినేటర్ కర్ణాకర్ రెడ్డి, జి. శ్రీనివాసరావు  పాల్గొన్నారు.