Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 5:19 pm Posted by : ramakrishna

ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి

 

. . . షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రాంతీయంగా చిన్న వ్యాపారులకు వాణిజ్య సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని, ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, నాగిరెడ్డి పేట్ మండల కేంద్రం, గోపాల్‌ పేట్‌ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న 6 గదుల షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కు మంగళవారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Economic activity will accelerate