మట్టి గణపతి వల్ల పర్యావరణ సమతుల్యత
జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ బతుకమ్మ, నిజామాబాద్ : మట్టి గణపతి ల వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. అమ్రాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు సురేష్, డ్రాయింగ్ టీచర్ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 250 మట్టి వినాయకులను తయారు చేశారన్నారు. మట్టి వినాయకుల తయారీలో పదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో మట్టి...