Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 5:11 pm Posted by : ramakrishna

మట్టి గణపతి వల్ల పర్యావరణ సమతుల్యత

  • జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్

బతుకమ్మ, నిజామాబాద్ : మట్టి గణపతి ల వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. అమ్రాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు సురేష్, డ్రాయింగ్ టీచర్ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 250 మట్టి వినాయకులను తయారు చేశారన్నారు. మట్టి వినాయకుల తయారీలో పదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో మట్టి గణపతి వాడటం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మట్టి గణపతి లను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు, డ్రాయింగ్ టీచర్, విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యం, డ్రాయింగ్ టీచర్ రమేష్, ఉపాధ్యాయులు మమత, గంగాధర్, జలజ, నీరజ, హేమలత, వనిత, విజయలక్ష్మి, రమేష్, పిడి అనురాధ పాల్గొన్నారు.