ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం
ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్ తో కలిసి సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి...