Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 7:05 pm Posted by : ramakrishna

అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డే

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని  దోన్ పాల్ గ్రామంలో శనివారం ఈసీసీఈ డే  నిర్వహించినట్లు అంగన్వాడి టీచర్ సుజాత తెలిపారు. కార్యక్రమంలో భాగంలో చిన్నారుల యొక్క తల్లిదండ్రులను ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రీస్కూల్ విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి ప్రీస్కూల్ విద్యను అంగన్వాడి చిన్నారులకు అందిస్తున్నామని తెలియజేయడం జరిగింది. పిల్లల యొక్క శారీరక మానసిక పెరుగుదలను అంచనా వేస్తున్నామని చెప్పడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంలో తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది.  పిల్లలందరినీ క్రమం తప్పకుండా అంగన్వాడికి పంపుతామని తల్లిదండ్రులు సంతోషంగా చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి పిల్లల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ సుమలత తదితరులు పాల్గొన్నారు.

ECCE Day at Anganwadi Center