. . . రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రత
వెబ్ డెస్క్, బతుకమ్మ:
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వైపు నైరుతి రుతుపవనాల ప్రవేశం కాలంలో వర్షాలు కురుస్తుండగా తెలంగాణ ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఉదయం భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 3.8 గా రికార్డు అయ్యాయి. ఈ భూకంపం కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం పరిసరాలు మొదలుకొని ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వాయువ్య దిశలో 111 కిలోమీటర్ల దూరంలో భూగర్బంలో కేంద్రీకృతమైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలజీ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ, లక్ష్మిదేవిపల్లి, సుజాత నగర్, చుంచుపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, టేకులపల్లి పరిసర ప్రాంతాల్లో ఉదయం 4 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం తీవ్రత కారణంగా జనాలు ఇళ్ల బయటకు పరుగులు తీశారు. భూకంపం వలన ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.