Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 10:55 pm Posted by : ramakrishna

ఆదిలోనే చెట్ల నరికివేత

  • ఎల్లారెడ్డి రేంజ్ లో అటవీ అధికారుల పరిశీలనలో గుర్తింపు
  • అధికారుల పరిశీలన తరువాత ఆగని చెట్ల నరికివేత

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని కళ్యాణి బీట్ పరిధిలో రత్నాపూర్ గ్రామ శివరు లోని అడవి ప్రాంతంలో చెట్ల నరికివేత కొనసాగుతుంది. ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అడవి ప్రాంతానికి పరిశీలించినప్పటికి  అడవి ప్రాంతంలో చెట్లు నరికివేత కొనసాగుతూనేవుంది.

  • ఫారెస్టు అధికారులు కళ్లు తెరిచేది ఎప్పుడు..

ఎల్లారెడ్డి మండలం రత్నాపూర్ గ్రామ పరిధిలో ఫారెస్ట్ భూముల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు స్థానికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. పోడు వ్యవసాయం పేరిట చెట్ల నరికివేత కొనసాగుతుంది. ఆటవీ ప్రాంతంలో కలపను నరికి ఇటుక బట్టీలకు తరలించి ఇటుకలు కాల్చడం వంటి చర్యలు నిత్యం కొనసాగుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రత్నాపూర్ పరిధిలో ఉన్న ఫారెస్ట్ భూముల్లో ఇటుకల కోసం మట్టి తవ్వడం, చెట్లను నరుకి వాటికి కావాల్సిన కట్టెలు అక్కడికక్కడే కాల్చడం జరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఫోటోలు, వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నప్పటికీ సంబంధిత బీట్ అధికారులు, రేంజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • 2018 నాటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయా..?

2018లో లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో అరుదైన వృక్షాలను నరికిన ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వాటి విలువ రూ.4 లక్షల రూపాయలుగా అంచనా వేసిన అటవి శాఖే ఇప్పుడు అదే ప్రాంతంలో జరుగుతున్న మౌనంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలోనూ ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి సస్పెండ్ అయ్యారు. ఇంచార్జీ అధికారి పాలనలో రేంజ్ పరిధిలో ఫారెస్ట్ భూములపై గుట్టలు ఆక్రమణలు జరుగుతున్నాయి.  రేంజ్ పరిధిలో బీట్ అధికారులు ఉన్నప్పటికీ వారి  కనుసన్నులలోనే అక్రమంగా కలప, నిర్మాణ సామాగ్రి తరలింపు, చెట్ల నరికివేత యుదేచ్చగా జరుగుతున్నాయి.

  • అధికారులపై చర్యలు ఎప్పుడు..

ప్రభుత్వం పోడు వ్యవసాయ భూములకు పట్టాల విషయం ఇప్పటికి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. కాని పోడు పేరిట అడవి నరికివేత సాగుతోంది. ఇక రిజర్వు ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఇటుక బట్టీలకు ఎలాంటి అనుమతులు లేకుండానే కలప నరికి బట్టీలలో కాల్చుతున్న చర్యలు లేవు. నిర్మాణాలకు, ఫర్నిచర్ కోసమని విలువైన టేకు చెట్లను ఆదిలోనే నరికి వేస్తున్నారు. రెంజ్ పరిధిలో సెక్షన్ ఆఫీసర్ లు, బీట్ ఆఫీసర్ లు ఉన్నప్పటికి పెట్రోలింగ్ సాగుతుండగా జరుగుతున్న అటవి ప్రాంతాల హననం పై కఠీన చర్యలు తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.