Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 3:18 pm Posted by : ramakrishna

మాల సంఘం నాయకుల ముందస్తు అరెస్టు

మద్నూర్, బతుకమ్మ:  ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాలలు గురువారం అసెంబ్లీ ముట్టడి తలపెట్టిన నేపథ్యంలో మద్నూర్ పోలీసులు స్థానిక మాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఎస్సీ వరికరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగ వ్యతిరేక తీర్పు అని ఎస్సీ కులంలో 59 కులాలు ఉన్నాయని అందులో మాదిగలకే ఎక్కువ రిజర్వేషన్ కల్పించడం సమన్యాయం కాదని, సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకోవాలని అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో మాల నాయకులు మాన్ కారే సంజు, వాగుమారే మారుతి తదితరులున్నారు.