కారోబార్ ల ముందస్తు అరెస్ట్

బతుకమ్మ మోర్తాడ్: హైదరాబాదులో మంగళవారం తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్స్, సిబ్బంది సమస్యలపైన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఇందిరా పార్కులో జరుగుతుంది.ఈకార్యక్రమానికి హాజరు కాకుండా ముందస్తు చర్యగా మోర్తాడ్ మండలంలోని కరోబార్,  సిబ్బందిని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో సాయన్న, పృథ్వీరాజ్, లక్ష్మణ్, సుదర్శన్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.