Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 1:22 pm Posted by : ramakrishna

ఆశ వర్కర్ల ముందస్తు అరెస్ట్

రుద్రూర్, బతుకమ్మ : తమ డిమాండ్లను నెరవేర్చాలని ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఆశ వర్కర్లను రుద్రూర్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. రూ.18వేల వేతనం చెల్లించడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా, సాధారణ బీమా తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. పోలీసలు అరెస్టు చేసిన వారిలో జి.భూలక్ష్మి, జి.పుష్ప, ఎం.నిర్మల, ఎం. లక్ష్మి, ఫర్జనా, కే. మహేశ్వరి తదితరులున్నారు.