Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 5:21 pm Posted by : ramakrishna

డీవీకే విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి.

సీపీఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ

సిరికొండ, బతుకమ్మ :                                                                                                                                         

భారత విప్లవొధ్యమ యోధుడు, ఆదర్శకమ్యూనిస్ట్ నాయకుడు,సీపీఐ (ఎం. ఎల్ )ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి . కృష్ణ విగ్రహ ఆవిష్కరణ అన్ని వర్గాల నాయకులు విజయవంతం చేయాలని సీపీఐ(ఎం. ఎల్)రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు.ఆదివారం మండలంలోని గడుకోల్ గ్రామం లో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నవంబర్ 09న ఆర్మూర్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ శ్రేణులు, కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గోనాలని అయన కోరారు.
సీపీఐ (ఎం. ఎల్ ) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివి.కృష్ణ విప్లవోద్యమ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన మార్గదర్శడన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవోద్యమ ఎత్తుగడలు పోరాటాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిరూపించిన విప్లవ కార్యదీక్షకుడు అన్నారు. మార్చిసమంటే పిడివాదం కాదని శాస్త్రీయ సోషలిజమని భారత విప్లవకారులు ఇట్టి విషయం అర్థం చేసుకోవాలని భారత విప్లవ ఉద్యమానికి గొప్ప విప్లవ సిద్ధాంతాన్ని అందించిన ఉద్యమ యోధుడు అన్నారు. భారతదేశంలో విప్లవోద్యమం పురోగమనానికి భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసి విప్లవ ఎత్తుగడలను అందించిన విప్లవ రణధీరుడు అని ఆయన పేర్కొన్నారు . ఈ విగ్రహ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా సీ పీ ఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు కె జి రామచంధర్ హాజరై విగ్రహ ఆవిష్కరించనున్నరని, సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వి.కృష్ణ, డివిజన్ కార్యదర్శి బి.దేవారం, డీవీకే కూతురు డివి.దివ్య,పీడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.గోదావరి, టీయుసీఐ జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తన్న తో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం. ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్, డివిజన్ నాయకులు పి.రమ,ఆర్.దామోదర్,జి.సాయరెడ్డి, మండల నాయకులు ఈ.రమేష్,ఎం.లింబాద్రి, ఆర్.పుష్పలత, ఎం. డి అనిస్, బి.కిషోర్,జి.బాల్ రెడ్డి,పి.రామన్న,ఎస్.కిషోర్, జి.ఎర్రన్న, కట్ట.రాములు, తదితరులు పాల్గొన్నారు.