Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 7:02 pm Posted by : ramakrishna

దసరా సెలవులు.. బస్టాండులో కిక్కిరిసిన జనాలు

కామారెడ్డి, బతుకమ్మ: ఆదివారం నుండి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉండడంతో కామారెడ్డి బస్టాండులో ప్రయాణికులతో బస్టాండు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా పండుగ కావడంతో శనివారం ఉదయం నుండే బస్టాండ్ లలో ఒక పక్క ప్రయాణికులు, ఇంకోపక్క విద్యార్థులు తమ స్వస్థలాలకు తిరిగి వేల్లేందుకు ఎక్కువ శాతం బస్సులోనే రాకపోకలు సాగించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రానికి, పట్టణానికి వచ్చే పోయే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. విద్యార్థులు ఆనంద ఉత్సాహంతో గంతులేశారు. ప్రతి బస్సు ఫుల్ ఫుల్ గా ఉన్న ఫుట్ బోర్డు పై నిలుచుకుని ప్రయాణం చేస్తున్నారు. బతుకమ్మ ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించింది.

Dussehra holidays.. Crowds at the bus stand