Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2024, 2:53 pm Posted by : ramakrishna

సఫాయీ కార్మికులకు దసరా కానుక

మాచారెడ్డి, బతుకమ్మ: మండలంలోని అక్కాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది, సఫాయీ కార్మికులకు దసరా కానుకగా లక్ష్మీనర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నర్సింహారెడ్డి దుస్తులు అందజేశారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆయన సఫాయీ కార్మికులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డికి సఫాయీ కార్మికులు, గ్రామస్తులు, మాజీ పాలకవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.