Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 4:35 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే తోట ఆధ్వర్యంలో దసరా వేడుకలు

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ లో శుక్రవారం దసరా పండుగ సందర్భంగా కార్యకర్తలు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాబోయే జెడ్పిటిసి ఎన్నికలలో మంచి వ్యక్తికి సీటు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విజయవంతం సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయడం జరిగిందని నిన్ను కూడా పూర్తి పేర్కొన్నారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి, సర్పంచ్, ఎంపీటీసీలు సత్తా చూపిస్తారని కార్యకర్తలు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ వచ్చిన తర్వాత జుక్కల్ కు ఇవ్వకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సిందే జుక్కల్ నియోజకవర్గం డబుల్ బెడ్ రూమ్ వచ్చేటప్పుడు బాన్సువాడ నియోజకవర్గం పోచారం రెడ్డి తీసుకున్నారని వచ్చిన డబుల్ బెడ్ రూమ్ పోచారం రెడ్డి తీసుకున్నారని ఒకటి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని  ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జుక్కల్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూములు మంజూరు చేయడం జరిగిందని, చాలామంది లబ్ధిదారులు కోరుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిరుపేద లబ్దిదాలకు ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని తెలిపారు.