Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2024, 2:32 pm Posted by : ramakrishna

ఇందూరు తిరుమలలో దసరా వేడుకలు

Dussehra celebrations in Tirumala, Indore

నిజామాబాద్, బతుకమ్మ: మోపాల్ మండలం నర్సింగ్ పల్లి లోని ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్, సినీ హీరో ఆశిష్ క్షేత్రంలో నిర్వహించిన శమి పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి పల్లకీసేవ, విశేష ఏకాంత సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహా రెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, బలగం సినీ నిర్మాత హర్షిత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.