Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 2:37 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి సస్పెన్షన్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. రాజాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ ఐదేళ్ల పాటు పార్టీ నుంచి దుష్యంత్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తనను దొంగ అని సంభోందించడమే కాకుండా లేనిపోని ఆరోపణలు చేసి,  కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సొదరుడిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం ఇప్పుడు ఆజిల్లాలో చర్చనీయంశంగా మారింది.