ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో మంగళవారం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాలు భజన కీర్తనలు చేసిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తి అమ్మవారి చండి హోమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా నిర్వహిస్తూ, విజయదశమి వరకు అమ్మవారి స్వరూపాలు, వివిధ రకాల నైవేద్యాలతో ఉత్సవాలు...